ఐపీఎల్ లో…ఆడించాలా వద్దా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కీలక బౌలర్లకు విశ్రాంతి కల్పించాలనే ఆలోచనలో ఉన్నారు. బౌలర్లను ఐపీఎల్‌కు దూరంగా ఉంచాలన్న కోహ్లీ సూచన మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లలోని కీలక ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌కు దూరం కానున్నారు. మేలో ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు సమాచారం. ముంబై ఇండియన్స్ జట్టు బుమ్రా సేవలను కోల్పోయే అవకాశం ఉందనే విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు సూత్రప్రాయంగా వెల్లలడించారు. ఒకవేళ బుమ్రా ఫిట్‌గా ఉంటే కీలక మ్యాచ్‌ల్లో ఆడించి మిగతా మ్యాచ్‌ల్లో విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా మహేంద్ర సింగ్‌ ధోనీ మాత్రం అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసినంత మాత్రాన అలసిపోరు అంతేకాకుండా బౌలర్లలో నైపుణ్యాలు పెరుగుతాయి అని వివరించారు. తమ నైపుణ్యాలను పెంచుకోవడంపై బౌలర్లు దృష్టి పెట్టాలని సూచించారు. అయితే, బోర్డు మాత్రం కోహ్లీ సూచనకే మొగ్గు చూపినట్టు సమాచారం.

leave a reply