వరల్డ్‌కప్‌కు ధోని కీలకం… యువీ!

త్వరలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ఎంఎస్‌ ధోని చాలా కీలకమని సీనియర్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ పేర్కొన్నాడు. ధోని అనుభవం ఉన్న క్రికెటర్ అని అంతర్జాతీయ క్రికెట్‌లో అతని అనుభవం జట్టులో యువ క్రికెటర్లకు ఉపయోగపడుతుందని… వీరికి తోడు కెప్టెన్ విరాట్‌ కోహ్లికి బాగా
ఉపయోగపడతాడని యువీ తెలిపాడు. ఆటపై అతనికున్న అవగాహన జట్టుకు ఎంతో కీలకం అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. శుక్రవారం ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన యువీ ఈ విషయం వెల్లడించాడు.

ధోని వికెట్‌కీపర్‌గా వికెట్ల వెనక ఉండి ఆటఫై ద్రుష్టి సాధించగలడని అంతేకాక నిశితంగా పరిశీలించేందుకు మంచి అవకాశముంటుంది. ధోని మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడని, గత కొన్నేళ్లుగా కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతను మెరుగ్గా రాణిస్తున్నాడు. నాయకునిగా ధోని గురించి చెప్పనవసరం లేదు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అతని సలహాలు, సూచనలు యువ క్రికెటర్లతో పాటు కెప్టెన్ కోహ్లికి కూడా ఉపయోగపడతాయని. ఇటీవల ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధోని ఆటతీరు చూస్తే బ్యాటింగ్‌ సత్తా ఇంకా తగ్గలేదని తెలుస్తుందని యువీ వివరించాడు.

leave a reply