కోహ్లినే అత్యుత్తమం:క్లార్క్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో విరాట్‌ కోహ్లినే ఆల్‌టైమ్‌ నెంబర్‌ వన్‌ వన్డే బ్యాట్స్‌మన్‌ అని ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖెల్‌ క్లార్క్‌ తెలిపాడు. గొప్ప ఆటగాడిగానే కాకుండా తెలివైన సారథి అంటూ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసీస్‌ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌ గెలిచిన ఏకైక భారత, ఆసియా సారథిగా రికార్డు నెలకొల్పిన కోహ్లీని అభినందించకుండా ఉండలేనన్నాడు.. ఈ అద్భుత ఘనత సాధించారం సాదారణ విషయం కాదన్నాడు.  కోహ్లి వయసు ప్రస్తుతం ​30 అవడంతో అతను మరిన్ని రికార్డులను నెలకొల్పే అవకాశం ఉన్నాయన్నాడు.

ఇకపోతే టెస్టుల్లోనూ ప్రస్తుతం కోహ్లి అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నప్పటికీ, ఇంకా ఉత్తమ ఆటగాడిగా కొనసాగాలంటే అతడు మరింత రాటు దేలాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రస్తుతం టీమిండియా సాధిస్తున్న విజయాలలో కోహ్లీది ప్రధాన పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అంతేకాకుండా  ప్రపంచంలోని అన్ని అత్యున్నత మైదానాలలోనూ గొప్పగా రాణించాల్సిన అవసరముందన్నాడు. అలా అయితేనే టెస్టుల్లో కూడా ఆల్‌టైమ్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడని వివరించాడు. ప్రస్తుతం టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌కు బయలుదేరగా…ఈ నెల 23న తొలి వన్డే ప్రారంభంకానుంది.     

leave a reply