కావాలని అలా చేస్తారా..?

విశాల్‌తో వరలక్ష్మీ ప్రేమ, పెళ్లి అనే వార్తలు నన్ను అసహనానికి గురిచేస్తున్నాయి అంటూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. విశాల్ నాకు స్నేహితుడు మాత్రమేననీ, తమ మధ్య మరెలాంటి బంధం లేదని వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా సందర్భాల్లో చెప్పింది. విశాల్ కూడా ఇదే మాట చెబుతూ వచ్చాడు. అయినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు.

అయితే.. కొంతమంది పనికిమాలినవాళ్లు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. “నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను..  పెళ్లి చేసుకుని ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోతానని కొంతమంది కలలు కంటున్నారు. నేను ఎక్కడికీ వెళ్లను.. ఇక్కడే వుంటాను.. సినిమాలు చేస్తూనే వుంటాను. నేను ఎవరిని ఉద్దేశించి ఈ స్టేట్మెంట్ ఇచ్చానన్నది.. అవతలివారికి అర్ధమయ్యే ఉంటుంది. ఎన్ని నాటకాలు ఆడినా నన్ను తొక్కెయ్యలేరు” అని ఆమె స్పష్టం చేసింది.

leave a reply