పిల్లల్లో ఇమ్యునిటీ పవర్‌ లేదా..?

మీ ఇంట్లో పిల్లలు ఎక్కువగా జబ్బు పడుతున్నారా..? నిత్యం ఏదో ఒక జబ్బులు వస్తున్నాయా..? నిజానికి చెప్పాలంటే.. పెద్ద‌ల క‌న్నా చిన్న పిల్ల‌ల‌కే వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా వస్తాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే.. అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎక్కువగా దుమ్ము, ధూళిలో ఆడుతుంటారు. మరోవైపు శుభ్ర‌త త‌క్కువ‌గా పాటిస్తారు. స్కూల్‌లోనూ ఇత‌ర పిల్ల‌ల‌తో క‌లిసి తిరుగుతారు.. తింటారు క‌నుక వారికి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే పిల్ల‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే వారిలో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచాలి. పిల్లలు కాబట్టి వారికి జంక్‌ ఫుడ్‌ బాగా నచ్చుంది. వాటిని వీలైనంత దూరంగా ఉంచేందుకు ట్రై చేయండి. వాళ్లు ఇష్టపడే విధంగా ఇంట్లో తయారు చేసి ఇవ్వండి.

కాగా.. పిల్ల‌ల‌కు నిత్యం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ఇవ్వాలి. ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌ ఉండే ఆహారం ఇవ్వాలి. దీంతో వారిలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది. అలాగే నిత్యం నిమ్మ జాతికి చెందిన పండ్లు, క్యారెట్లు, ఆకు ప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, బీన్స్‌, స్ట్రాబెర్రీ, పెరుగు, వెల్లుల్లి, అల్లం తినిపించాలి. దీని వ‌ల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. అలాగే.. పిల్ల‌ల‌న్నాక నిద్ర‌పోకుండా మారాం చేయ‌డం స‌హ‌జ‌మే. కొంద‌రు పిల్ల‌లైతే అర్థ‌రాత్రి వ‌ర‌కు గేమ్స్ ఆడుతూ కాల‌క్షేపం చేస్తుంటారు. త‌ల్లిదండ్రులు ఇలాంటి పిల్ల‌ల‌ను త్వ‌ర‌గా ప‌డుకోబెట్టాలి. నిద్ర స‌రిగ్గా పోక‌పోతే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు చెప్పాలి. వారిని కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇత‌ర గ్యాడ్జెట్ల‌కు వీలైనంత దూరంగా ఉంచాలి. నిద్ర త‌గినంత‌గా ఉంటే పిల్ల‌ల్లో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

‘మొక్కై వంగనది మానై వంగునా’ అనే సామెత గుర్తుందా..? చిన్నప్పుడే మీ మాట వినకపోతే.. పెద్దయ్యాక అస్సలు పట్టించుకోరు. అలాగని ఎంతసేపు వారిపై అరుస్తూ ఉండకూడదు. వాళ్లకు నచ్చిట్టుగా ఉంటూ.. ఫ్రెండ్లీ నేచర్‌ అలవాటు చేసుకోవాలి. మీపై భయాన్ని పెంచవద్దు. వాళ్లకు అర్థమయ్యే రీతిలోనే వాళ్లకు చెప్పే ప్రయత్నం చేయడం. అలాగే వారికి సరైన గైడెన్స్‌ ఇవ్వాలి. ఇప్పడున్న కాలంలో ఎవరినీ నమ్మే స్థితిలో లేము కాబట్టి వారికి తెలియకుండా ఓ కంట కనిపెడుతూ ఉండండి.

leave a reply