“భైరవ గీత” సినిమా :రివ్యూ !

సంచలనాలకు మారు పేరు అయినా రాంగోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన సినిమా ‘భైరవ గీత’. ఆఫీసర్ చిత్రంతో పాతాళానికి పడిపోయిన రాంగోపాల్ వర్మ తరవాత తన నిర్మాణంలో కొత్త దర్శకుడు సిద్దార్థ తాతోలుచే రూపొందించిన  చిత్రం భైరవగీత. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిద్దార్థ ఈ చిత్రాన్ని ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించారు.

సినిమా పరంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయినది అని చెప్పొచ్చు. కధ విషయానికొస్తే భైరవ కుటుంబం వంశపారంపర్యంగా ఫ్యాక్షన్ నాయకుల దగ్గరే విశ్వాసంగా పని చేస్తుంటారు.(ధనుజయ)భైరవ కూడా సినిమాలో ఓ ఫ్యాక్షన్ దగ్గర పని చేస్తుంటాడు. కానీ ఆ ఫ్యాక్షన్ లీడర్ కూతురు భైరవను ప్రేమిస్తుంది. కధ ఇక్కడే మొదలు అవుతుంది ఫ్యాక్షన్ తండ్రి తనకు ఇష్టం లేని పెళ్లి నిశ్చయించడంతో హీరోయిన్ ఇంటి నుంచి పారిపోయి భైరవ వెతుకుంటూ వెళ్తుంది. ఈ సంఘటన తెలుసుకున్న ఫ్యాక్షన్ తండ్రి  భైరవను చంపాలని నిశ్చయించుకుంటాడు. తరువాత భైరవ తనను ఎలా కాపాడుకుంటాడో…వచ్చిన అమ్మాయి కోసం ఎం చేస్తాడు అనేదే కధ.

ఈ సినిమాలో మొత్తం రాంగోపాల్ వర్మ డైరెక్షన్ కనిపిస్తుంది కానీ కొత్త డైరెక్టర్ తీసినట్లు కనిపించదు. అప్పట్లో తెలుగు సినిమాను కొత్తగా చూపించిన వర్మ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. తన టేకింగ్ టైమింగ్ హీరోను చూపించే పద్ధతి అంత కొత్తగా ఉండేది. ఎంతో మంది వర్మకు ఫాన్స్ అయిపోయారు కూడా… కానీ  డైరెక్షన్లో కొత్త వరవడి తీసుకొచ్చిన వర్మ తరవాత అందరికి రొటీన్ అయిపోయాడు తన సినిమాల టేకింగ్ అలాగే ఉండిపోయింది మార్పు తీసుకురాలేకపోయాడు. అసలు విషయం ఏమిటంటే తరువాత వచ్చిన వర్మ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా వర్మ దారిలోనే నడుస్తున్నారని చెప్పనక్కర్లేదు. భైరవ గీత సినిమాని కూడా డైరెక్టర్ వర్మ దారిలోనే తీయడం సినిమాకు మైనస్ గా చెప్పొచ్చు. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అని చెప్పొచ్చు.

రేటింగ్ : 1.5/5

leave a reply