సర్కార్‌కు పంచాయతీ షాక్‌..

పంచాయతీ ఎన్నికలను జనవరి 10లోగా ముగించాలన్న హైకోర్టు ఆదేశాలు, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 60.55 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. ఇందులో బీసీలకు 34 శాతం ఉన్నాయి. సుప్రీం ఆదేశాలతో ప్రస్తుతం తెలంగాణ సర్కారు రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయాల్సి వస్తోంది. అందుకనుగుణంగానే ‘పంచాయతీరాజ్‌ చట్టం 2018’ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు.

దీంతో బీసీలకు 24 శాతానికి లోబడి రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్లు తగ్గుతుండడంపై బీసీ సంఘాలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయి. ఇదిలా ఉండగానే జేపీఎస్‌ పోస్టుల భర్తీపై కూడా హైకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వం ఈ నెల 25లోగా జేపీఎ్‌సలకు నియామక ఉత్తర్వులు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

leave a reply