క్రిస్మస్‌ సందర్భంగా..భారీ నజరానా!

ప్ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ పండుగ వాతావరణం మొదలైంది. మనకంటే కూడా యూరప్‌ దేశాల్లో ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. కాగా అనేక సంస్థలు పండుగ వేళ తమ ఉద్యోగులకు కానుకలు ఇచ్చి వారి అభిమానాన్ని తెలియచేస్తుంటారు. ఈ ఏడాది అమెరికాలో తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది. చాల వరకు ఎక్కువగా కొన్ని సంస్థలు కానుకలను వస్తు రూపంలో గాని .. మరికొందరు  నగదు రూపంలో గాని ఇస్తుంటాయి. అయితే అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఫ్లోరాక్రాఫ్ట్‌ సంస్థ ఉద్యోగుల పంట పండింది. క్రిస్మస్‌ సందర్భంగా ఆ సంస్థ సీఈవో లియో షానెర్‌ బ్రహ్మాండమైన కానుకను ప్రకటించారు. సంస్థలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగికి 20వేల డాలర్ల బహుమతిని అందజేయనున్నట్లు తెలియజేసారు. ఇండియన్ కరెన్సీలో  దీని విలువ సుమారు రూ.14 లక్షలు.

ఉద్యోగి కష్టపడి చేసే పనికి ప్రోత్సాహకంగానే బోనస్‌ ప్రకటించినట్లు చెప్పారు. కష్టపడే వారి శ్రమ ఎప్పుడు వృధాగా పోదని తగిన ఫలితం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు దానికి ఈ బోనస్‌ నిదర్శనమని ఆయన అన్నారు. ఫ్లోరాక్రాఫ్ట్‌లో సీనియారిటీ ఆధారంగా 200 మంది ఉద్యోగులను బోనస్‌కు ఎంపిక చేశారు. వీరందరి బోనస్ కోసం‌ ఆ సంస్థ ఈ ఏడాది ఏకంగా  4 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా 40 ఏళ్ల పైబడిన ఉద్యోగులకు సగటున సుమారు 60వేల డాలర్లు బోనస్‌గా ఇస్తున్నారట. అయితే ఈ బోనస్ ఒక్క సరిగా కాకుండా 25 శాతం ఇపుడు ఇచ్చి. మిగిలిన 75శాతం రిటైర్మెంట్‌ సమయంలో చెల్లించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

leave a reply