ఇకపై లేడీ పోలీస్‌… పారాహుషార్..!

ఇప్పటి దాకా పోలీస్ స్టేషన్‌లోనే విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బంది చూస్తుంటాం. మహిళా పోలీసులు కూడా ఇక నుంచి బయటకు వెళ్లి గస్తీ విధులు నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొలిసారిగా మహిళ బ్లూ కోల్ట్స్ సిబ్బందిని ప్రవేశ పెట్టారు.

మహిళ కానిస్టేబుళ్లు ఇక నుండి తమ సేవలు అందించనున్నారు. ఇప్పటి దాకా పురుష పోలీసులకే పరిమితమైన గస్తీ విధులను మహిళా పోలీసులకు కేటాయించారు. ప్రత్యేకించి మహిళా సమస్యలపై వారు దృష్టి సారిస్తారు పురుష కానిస్టేబుల్‌తో సమానంగా విధులు నిర్వహిస్తారు.

సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ఏసిపి కేఎస్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. హైదరాబాద్ నగర  పోలీస్ శాఖ నూతన తరహాలో మహిళా కానిస్టేబుళ్లకు అన్నపూర్ణ, ఇర్ఫాన్ లకు రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించామని ఇక నుంచి ప్రతి డివిజన్‌కు ఇద్దరు చొప్పున మహిళ కానిస్టేబుళ్లును నియమించామన్నారు.

సాధారణ కానిస్టేబుల్ మాదిరిగా వీరు కూడా బైక్ పై తిరుగుతూ పెట్రోలింగ్, వెహికల్ చెకింగ్, నిర్వహిస్తారు. ప్రత్యేకించి మహిళల సమస్యలపై స్పందిస్తారు. ఈవ్ టీజింగ్, వేధింపులు తదితర సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణ కల్పిస్తారు.

జనవరి 1 2019 రోజు మహిళల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని ఏసిపి రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి, ఏస్ఐలు  పాల్గొన్నారు.

leave a reply