చోరీలకు పాల్పడుతున్న…డాన్సర్?

డాన్సర్ గా ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తి. విర్వర్లలోకి వెళ్తే న్యూఢిల్లీ కి చెందిన అరుణ్ కుమార్ ఒక డాన్సర్. ప్రతీరోజూ నృత్యం చేస్తూ వాటిని షూట్ చేసి ఆ వీడియోలను తిరిగి యూట్యూబ్ లో పెడుతుంటాడు. రాత్రికాగానే తనకున్న ఏడుగురు స్నేహితులతో కలిసి స్కార్పియో లో తిరుగుతూ ఇంట్లో ఎవరూలేని సమయాలలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతుంటారు. ఈ దొంగలముఠాలోఅరుణ్ కూడా ఓ సభ్యుడు ఇతను డ్రైవరుగా వ్యవహరిస్తుంటాడు. ఇతను వేగంగా కారు నడపడంలో అనుభవశాలి. మరో వ్యక్తి ఐదునిమిషాల్లోనే ఇంటి తాళం పగులగొడతాడు. మిగతావారు ఇంటి బయట గార్డులుగా కాపలా ఉంటారు. దొంగలందరూ ప్రత్యేక చైనా ఫోన్లతోపాటు వాకీటాకీలు తీసుకొని చోరీలు చేస్తున్నారు.

జంగపురా ఎక్స్ టెన్షన్ లో వీరు దొంగతనానికి పాల్పడ్డారు ఈ చోరీతో వాళ్ళ బాగోతం బయటపడింది. ఈ దొంగల ముఠా నుంచి పదిలక్షలరూపాయల విలువగల వజ్రాల ఆభరణాలు, ఓ కారు, చెవర్లెట్ బీట్ కారు, బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంతో కొంతమందిని పట్టుకున్నారు. పెళ్లిళ్లు, ఇతర పార్టీల్లో డాన్సులు చేసే అరుణ్ ముఠా సభ్యులను గుర్తించి వారిని అరెస్టు చేసి ప్రశ్నించగా అసలు గుట్టు వీడింది. దొంగల ముఠాలో హర్ష్, ఐమాన్, కప్టాన్, అంకిత్, విశాల్, ఆకాష్ లు ప్రధాన నిందితులుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

leave a reply