కథ.. కంచెకు చేరింది..

మొత్తానికి తెలంగాణా ఎన్నికల ఫలితాలు టెన్షన్‌ వాతావరణం మధ్య ఊగీసలాడుతూ తుది తీర్పునుఇచ్చింది. ఈసారి ఎలాగైనా సీఎం సీటును సాధించాలని ప్రజాకూటమికి చుక్కెఎదురైంది. ఎంతోధీమా వ్యక్తం చేసిన కేసీఆర్‌ను అంతే భరోసాతో ప్రజలు తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.చాలా చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. లగడపాటి అంచనాలుతలకిందులయ్యేలా ప్రజలు కేసీఆర్‌కు పట్టం కట్టారు. ముందు నుంచీ అన్ని ప్రాంతాల్లోఆధిక్యం కనబరుస్తూ టీఆర్‌ఎస్‌ ఉంది. కొన్ని చోట్లైనా కాంగ్రెస్‌ వస్తుందని ఆశపడ్డానిరాసే ఎదురైంది. పెద్ద పెద్ద కాంగ్రెస్‌ నాయకుల సీట్లను సైతం టీఆర్‌ఎస్‌ పార్టీకైవసం చేసుకుంది. కోదండరాం, గద్దర్‌ నిలబడిన సీట్లను సైతం టీఆర్‌ఎస్‌ కైవసంచేసుకోవడం ఆశ్చర్యానికి గురైన అంశం. కాగా ఈరోజు.. సంబరాలకు ఈసీ పర్మిషన్‌ఇవ్వకపోయినా టీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటాయి. కేసీఆర్‌ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అలాగే చిన్నవయస్సులోఆరుసార్లు ఎమ్మెల్యేగా నిలిచిన హరీశ్‌రావు కొత్త రికార్డును నెలకొల్పారు. అయితేమొత్తానికి గులాబీ బాస్‌ బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

leave a reply