జీతం కోసం అడ్డదారులు.. మొత్తానికే బెడిసికొట్టింది

చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో పదోన్నతి కోసం అడ్డదారులు తొక్కారు. ఫలితంగా ఏఈఓ హేమమాలిని సస్పెన్షన్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఆలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేస్తున్న రాధాకృష్ణ, చంద్రశేఖర్‌ ఇద్దరూ పొరుగుసేవల కింద నియమితులయ్యారు. వీళ్లు తమ జీతాల పెంపుకోసమని దస్త్రం సిద్ధం చేసుకున్నారు.

విజయవాడలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని సహాయంతో నకిలీ జీవో తెచ్చిన సంగతి వెలూగులోకి రావడంతో  దీనిపై వేంటనే   దేవాదాయ శాఖ కమిషనర్‌.. తిరుపతి ఆర్జేడీ భ్రమరాంబను విచారణకు ఆదేశించారు. ఇటీవల ఆలయానికి వచ్చి ఆమె విచారించి.. ఉన్నతాధికారులకు నివేదించారు.

తప్పుడు దస్త్రాలతో వేతనాలు పెంచుకున్న పొరుగు సేవకులు చంద్రశేఖర్‌, రాధాకృష్ణలను రెండ్రోజుల క్రితం విధుల నుంచి తొలగిస్తూ ఈవో రామస్వామి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా.. ఇదే దస్త్రానికి సంబంధించి ఏఈవో తీరు సరిగా లేదన్న భావనతో హేమమాలిని కూడా తను పదోన్నతి ఇదే విదంగా నకిలీ దస్త్రాలతో పోఁదడంతో సమచారం తేటతెల్లం అవ్వటంతో  ఏఈవో హేమమాలిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌పై కూడా సస్పెన్షన్‌ వేటు పడినట్లు సమచారం.

leave a reply