అవగాహన కోసం..

రాజస్థాన్‌లో విద్యార్థినులకు అక్కడి ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ కాలేజీల్లో శానిటరీ నాప్‌కిన్‌ వెండింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాజస్థాన్‌లో మొత్తం 189 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. 2019 జులై నాటికి వీటన్నింటిల్లో శానిటరీ ప్యాడ్‌ వెండింగ్‌ మిషన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది.

రుతుక్రమంపై ఇప్పటికీ చాలా మంది మహిళలు అవగాహన ఉండట్లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆచారాలు, నమ్మకాలతో వ్యక్తిగత శుభ్రత పాటించట్లేదు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇక శానిటరీ నాప్‌కిన్‌ల ధర వల్ల కొందరు మహిళలు వాటిని ఉపయోగించట్లేదు. అలాంటి మహిళల కోసం ప్రభుత్వమే వాటిని ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే రాజస్థాన్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

leave a reply