సారూ…నేను తాగలేదు!

నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు అనేక చోట్ల “డ్రంక్ అండ్ డ్రైవ్” నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు బండిని సీజ్ చేసారు. అయితే ఆ వ్యక్తి మాత్రం  తాను మద్యం తాగలేదంటూ ఎంత చెప్పిన వినకుండా పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ సంఘటన డిసెంబర్ 31న నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి అర్ధరాత్రి వరకు డ్యూటీ చేసుకొని వస్తుండగా తాడ్ బంద్ చౌరస్తా వద్ద పోలీసుల తనిఖీలలో మద్యం సేవించినట్లు బ్రీత్‌ అనలైజర్ లో తేలింది. అయితే తాను తగలేదన్న పట్టించుకోకుండా బండిని సీజ్ చేసారని చెప్పాడు.

దీనితో గాంధీ ఆసుపత్రి వెళ్లి పరీక్షా చేయించుకొని నుంచి తాను మద్యం తాగలేదని నివేదిక తీసుకువచ్చినా వారు అంగీకరించలేదు. ఈ ఘటనఫై బాధితుడి కథనం ప్రకారం..ఉప్పల్‌కు చెందిన నాగభూషణ్‌రెడ్డి తాడ్‌బంద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు.  సోమవారం అర్ధరాత్రి వరకు విధులను నిర్వర్తించి రాత్రి  తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. అయితే తాడ్‌బంద్‌ చౌరస్తాదగ్గర పోలీసులు  ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అతడికి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు చేసారు. అయితే భారీగా మద్యాన్ని సేవించినట్లు అనలైజర్ చూపడంతో, పోలీసులు కేసు నమోదుకి చేసారు. బాధితుడు  గాంధీ ఆసుపత్రికి వెళ్లి  పరీక్షలు చేయించుకోగా తగలేదని అక్కడి వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారు. సర్టిఫికెట్ చూపించిన పోలీసులు వాహనం విడిచిపెట్టకపోవడం గమనార్హం.

leave a reply