అనంతపురంలో బంగారు, వజ్రాల గనులు..!

అనంతపురం జిల్లా కరవుకు ప్రతినిథిలా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ కరవు అనంత జిల్లా బంగారం, వజ్రాల మెరుపులు మెరవబోతోంది. జిల్లాలో వజ్రాలు, బంగారు ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్టు అధికారిక ప్రకటన వచ్చింది. జీఎస్ఐ జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని స్పష్టంచేసింది.

వజ్రకరూరు ప్రాంతంలోనే బంగారు, వజ్రాల గనులను గుర్తించామని హైదరాబాద్‌లో ఓ మీడియా సమావేశంలో జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీధర్‌ తెలిపారు. ఒక క్యారెట్‌ కంటే తక్కువ నాణ్యతతో వజ్ర ఖనిజాలు ఉన్నాయని శ్రీధర్ అన్నారు. అనంత పరిధిలోని 390 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు ఖనిజం ఉందని..

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా సాల్వనూర్‌లో వజ్రాల ఖనిజ నిక్షేపాల వంటివే అనంతపురంలోనూ ఉన్నాయని డైరెక్టర్‌ జనరల్‌ శ్రీధర్‌ వెల్లడించారు.

leave a reply