అరిగించే కాయ..

అరటిపళ్లు అందరికీ తెలిసిన ఇక ఫ్రూట్‌ అని కూడా అనొచ్చు. అరటికాయలను మామూలుగా కూరలకు వాడుతూంటారు. దీని వల్ల లాభాలు కూడా చాలా ఉన్నాయనీ మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మళ్లీ ఒకసారి గుర్తుచేసుకుందాం.

అరటిపళ్లు ఆరోగ్యానికి చాలా మంచి ఔషదమని డాక్టర్స్‌ కూడా చెబుతున్న విషయమే. ఆరోగ్యం సరిగా లేనప్పుడు వీటిని తినమని రిఫర్‌ చేస్తారు. అలాగే ఇవి అందరికీ ఈజీగా లభించేవి. అరటిలో పిండిపదార్థాలు, షుగర్‌ లెవల్స్‌, ఎక్కువ. ప్రతి 100 గ్రాముల అరటిలో 20 గ్రాముల కార్బోహైడ్రేటులు, 1గ్రాము ప్రోటీనులు, 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నాయి. అరటి సులభంగా జీర్ణమై, మలబద్ధం రాకుండా కూడా శరీరాన్ని కాపాడుతుంది.

అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు 74% కంటే ఎక్కువగా నీరు ఉంటుంది. 23% కార్బోహైడ్రేటులు, 1% ప్రోటీనులు, 2.6% ఫైబరు ఉంటుంది. ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్ధతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అందుకే అరటి పండు పేదవాడి యాపిల్‌ పండు అని అంటారు. ఎందుకంటే, రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి. కాని, అరటి పండు చవక, యాపిల్‌ ఖరీదు.

అంతేకాదండోయ్‌.. అరటిపండు చాలా వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ఉదాహరణకు.. దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు. అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. జీర్ణ సంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.

కాబట్టి మీరూ రోజుకో అరటిపండు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.

leave a reply