తిరుమలలో రద్దీ.. పెరిగింది!

కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ నెలతో ముగుస్థుండతంతో భక్తుల రద్దీ ఎక్కువ అయినది. శ్రీవారి సర్వదర్శనం 17 గంటల పైగా పడుతుంది. మొత్తం కంపార్ట్మెంట్స్ నిండిపోయి భక్తులతో రద్దీగా ఉంది.అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైం స్లాట్ ఉన్న భక్తుల దర్శనానికి మూడు గంటల పైగా పడుతుంది. పైగా నిన్న 72 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు. అలాగే శ్రీవారి నిన్నటి హుండీ ఆదాయం 2.43 కోట్ల రూపాయలని ఆలయ ప్రధాన అధికారులు చెప్పుకొచ్చారు .

leave a reply