నేను భయపడను.. తగ్గను..

విశాఖలో జరిగిన ఆత్మీయ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అందులో భాగంగా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ నేను ఎక్కడ ఉన్నా.. తెలుగు రాష్ట్రాలగౌరవం, ప్రయోజనాల కోసమే కష్టపడతా తప్ప.. అడ్డుపడనని అన్నారు. రెండు రాష్ట్రాలు విభేదాల్లేకుండా ముందుకు వెళ్లాలనే నేను కోరుకుంటున్నా అని అన్నారు. హైదరాబాద్‌లోఇటీవల ఎన్నికల ప్రచారం చేశానని, ప్రచారానికి వెళ్తే..అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తామంటున్నారని అన్నారు. అలాంటి వ్యాఖ్యలకు తాను భయపడనని చంద్రబాబు స్పష్టంచేశారు.

అన్నిరాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కవగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచానికే గుర్తిండిపోయేలా ఏపీలో రాజధాని నిర్మించాలనుకుంటున్నాం..దానికి బీజేపీనే సహకరించడం లేదన్నారు. అలాగే.. ఏపీకి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్నటీఆర్‌ఎస్‌కు జగన్‌, పవన్‌ ఎందుకు మద్దతు పలుకుతున్నారో అర్థం కావడంలేదు. అసలు వాళ్లకు ప్రత్యేకహోదా వద్దా..? అని ప్రశ్నించారు. మనకి మనం సహాయం చేసుకోవాలే తప్ప.. వేలుచూపించకూడదని అన్నారు.

ప్రత్యేక హోదా ఇస్తానన్న బీజేపీ మొండి చేయి చూపించింది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి.. ఇందుకు ఇక బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ఇదే నిదర్శనం. ప్రజలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. దేశంలో అవినీతి లేని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో ఉందన్నారు.

ఒక్కడినే పోరాడితే ఉపయోగం లేదనే అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. మంచో చెడో విభజన జరిగి ఆదాయం తెలంగాణకు వెళ్లిందన్నారు. అయినా ఏపీని అభివృద్ధిచేసే శక్తిని దేవుడు తనకిచ్చారని వ్యాఖ్యానించారు. కేసుల మాఫీ కోసం వైకాపా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతోందని.. జగన్‌, పవన్‌, కేసీఆర్‌లను ప్రధాని మోదీ తమపైకి ఎగదోస్తున్నారని ఆరోపించారు. కేంద్రం సహకరిస్తే గుజరాత్‌ను మించి అభివృద్ధి చెందుతామని మోదీకి భయం పట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్‌ ఫొటోలు పట్టుకుని ప్రతిపక్ష నేతలు ఊరేగుతున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

leave a reply