ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం.

ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం పేరును లోగోను మార్చడం జరిగింది.

ఢిల్లీ డేర్ డెవిల్స్: 2008 లో ప్రారంభ ఎడిషన్ నుండి ఇండియన్ ప్రీమియర్ లీగులో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక  భాగం అని  అందరికి  తెలుసు,ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో  ప్రాంచైజీ కొత్త  నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన వేలం ఈ నెల 18వ తేదీన జైపూర్‌లో జరుగనున్నట్లు బీసీసీఐ ముందుగానే  ప్రకటించింది.  ఈ దశలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం (డిసెంబర్ 4) ఢిల్లీ  యాజమాన్యం ఢిల్లీ డేర్ డెవిల్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ గా   పేరు మారుస్తున్నట్లు  ప్రకటించడం  జరిగింది.అంతేకాకుండా తమ ఫ్రాంచైజీ పేరుతో  పాటు  లోగోను మారుస్తున్నట్లు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

జనవరి 2008 లో 84 మిలియన్ డాలర్ల మొత్తానికి ఢిల్లీ  జట్టును  జీఎంఆర్ గ్రూప్ సొంతం చేసుకోవడం అందరికి  తెలిసిందే.కానీ  ప్రారంభ రెండు ఎడిషన్లలో సెమీ ఫైనల్కు  చేరింది ,  అప్పటి నుండి గత  తొమ్మిది సంవత్సరాల్లో  ఒక్కసారి మాత్రమే  ప్లే ఆఫ్స్క కు  చేరింది. గత సీజన్ వేలంలో ఢిల్లీ గూటికి చేరిన గౌతమ్ గంభీర్ సీజన్‌లో జట్టు పరాజయాలకు భాద్యత వహిస్తూ.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది సన్‌రైజర్స్ జట్టులో ఓపెనర్‌గా ఉన్న శిఖర్ ధవన్‌ను ఢిల్లీ జట్టు దక్కించుకుంది.  ఇప్పుడు ఏకంగా ఫ్రాంచైజీ పేరును లోగోను  మారుస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. పేరు మార్పుతో జట్టులో కొత్త ఉత్తేజం వచ్చిందని. తమ   ప్రాంచైజీ కొత్త ఆటగాళ్లలో ఉన్న  టాలెంట్‌ని గుర్తించడంలో ఎప్పుడు ముందుంటుంది అని చెబుతూ , ఈ ఏడాది కైఫ్ కూడా చేరడంతో తమ జట్టుకు మరింత బలం చేకూరిందని మరో ఓనర్ పార్త్ జిందాల్ తెలిపారు.

leave a reply