తొలి రౌండ్లోనే …గెలిచింది!

ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌-500 టోర్నమెంట్‌ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ అనూహ్యంగా గెలుపొందింది. 2018లో 018లో ఇదే టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ సారి అర్ధాంతరంగా ముగిసిన మ్యాచ్ లో  సైనా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. దీంతో మరో మేజర్‌ టైటిల్‌ సైనా ఖాతాలో చేరింది.  ఆదివారం జరిగిన తుదిపోరులో ఆమె ప్రత్యర్థి కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) తొలి గేమ్‌లోనే కాలికి గాయం అవడంతో మ్యాచ్  కోల్పోవలసి వచ్చింది. అదే సమయంలో సైనా 4–10తో వెనుకబడి ఉంది. కరోలినా అట కొనసాగించిన తన వాళ్ళ కాదంటూ కుప్పకూలడంతో సైనాను విజయం వరించింది.

టైటిల్ విజేత సైనాకు 26, 250 డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. అయితే గత రెండేళ్లలో సైనాకు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ కావడం విశేషం. 2017లో ఆమెకు మలేసియా మాస్టర్స్‌ టైటిల్‌ వరించింది.  పోయిన వారమే మలేసియా మాస్టర్స్‌ టోర్నీలో సైనాపై విజయం సాధించిన మారిన్‌ ఈ సారి హాట్  ఫేవరెట్‌గా బరిలోకి దిగింది.

మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడు పెంచిన మారిన్‌ 9–2తో దూసుకుపోయింది. ఈ దశలో ఒక్కసారిగా కోర్టులో పడిపోవడంతో కాలికి గాయమైంది. స్వల్ప  విరామం అనంతరం ఆమె ఆట కొనసాగించినా…మరో మూడు పాయింట్ల అనంతరం నొప్పి ఎక్కువ అవడంతో ఇక తన వల్ల కాదంటూ కుప్పకూలింది. తీవ్ర ఆవేదనతో మారిన్‌ కోర్టు వీడగా…సైనా విజేతగా నిలిచింది. దీనిపై సైనా మాట్లాడుతూ… “నేను టైటిల్‌ సాధించిన తీరు పట్ల పెద్దగా సంతోషం లేదు. ఫైనల్లో నేను వెనుకబడ్డాననేది వాస్తవం. అయితే గట్టి పోటీ మాత్రం ఇచ్చేదాన్ని. దురదృష్టవశాత్తూ ఈ ఘటన చోటుచేసుకుంది.  కోర్టులో ఈ తరహాలో గాయపడటం చాలా బాధాకరం. నాకు కూడా ఇలాంటి అనుభవం గతంలో ఎదురైంది కాబట్టి ఆ వేదన ఎలాంటిదో బాగా తెలుసు’ అని మ్యాచ్‌ అనంతరం సైనా వివరించింది.

leave a reply