మోదీ సర్కార్‌కు…కృతజ్ఞతలు!

పండగ సీజన్ దగ్గరకు వస్తున్న సమయంలో టాలీవుడ్లో కూడా సినిమాల సందడి మొదలవుతుంది. టిక్కెట్ల  ధర కూడా పరిగిన సంగతి తెలిసిందే… అయితే తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.  జీఎస్టీ తగ్గించినందుకు   కేంద్ర ప్రభుత్వానికి టాలీవుడ్ కృతజ్ఞతలు తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  ఈ నెల 22నాటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు వీటిలో సినిమా టిక్కెట్లను పరిగణించడం వలన, 23 రకాల వస్తు, సేవలపై పన్ను భారాన్ని తగియించిన సంగతి తెలిసిందే.

 తాజా జీఎస్టీ ప్రకారం రూ.100 వరకు ధర కలిగిన టికెట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఆపై ధరగల టికెట్లకు 18 శాతం విధించారు. ఇంతకుముందు ఇది 28 శాతంగా ఉండేది. దీనితో సినిమా టిక్కెట్ల ధర తగ్గే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. సినిమా టిక్కెట్లపై జీఎస్టీని తగ్గించడం వల్ల ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం పడిపోనుందని సమాచారం. సమరించిన పన్నులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది.

leave a reply