ఓపెనర్‌గా దినేశ్‌కు అవకాశం ఇవ్వాలి!

గత కొంతకాలంగా భారత క్రికెట్‌ జట్టు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ఓపెనర్లగా రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు మంచి ఫామ్ కనబరుస్తుండగా, తాజాగా వీరికి తోడు మూడో ఓపెనర్‌గా దినేశ్‌ కార్తీక్‌ను కూడా పరీక్షించాలని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ పేర్కొన్నాడు. వరల్డ్‌కప్‌లో మూడో ఓపెనర్‌గా దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యులర్‌ కీపర్‌గా ఎంఎస్‌ ధోని సేవలందిస్తుండగా దినేశ్‌ కార్తీక్‌ వరల్డ్‌కప్‌ స్థానంపై చర్చ మొదలైంది.  వరల్డ్‌కప్‌కు మరో కీపర్ గా రిషభ్‌ పంత్‌ పోటీ పడుతుండగా, ఈ సమయంలో దినేశ్‌ వరల్డ్‌కప్‌ స్థానంపై టీమిండియా తర్జన భర‍్జనలు పడుతోంది. అయితే దినేశ్‌ కార్తీక్‌ను వరల్డ్‌కప్‌ జట్టులో చోటు కల్పిస్తూనే ఓపెనర్‌గా పరీక్షించాలని గావస్కర్‌ తెలిపాడు.

త్వరలో జరగబోయే వరల్డ్‌కప్‌లో దినేశ్‌ కార్తీక్‌ను మూడో ఓపెనర్‌గా చూడాలనుకుంటున్నానని . వరల్డ్‌కప్‌లో ఇద్దరు రెగ‍్యులర్‌ ఓపెనర్లకు సాయంగా మరొక ఓపెనర్ అవసరమని, ఇందుకోసం దినేశ్‌ కార్తీక్‌ సరైన వాడనేది నా అభిప్రాయం. టెస్టుల్లో  దినేష్ ఆటతీరును చూసాం. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలు సందర్భాల్లో మ్యాచ్‌ ఫినిషర్‌గా కార్తీక్ మెప్పించాడు. వీటిని దృష్టిల్లో పెట్టుకుని వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీలో దినేశ్‌ కార్తీక్‌ను మూడో ఓపెనర్‌గా రిజర్వ్‌లో పెట్టుకోవడమే మంచిదని గావస్కర్‌ పేర్కొన్నాడు.

leave a reply