నేను అలా చేసుండకూడదు..

కత్రినాకైఫ్‌ ఎందుకు అలా అనుకుంటుంది..? నిజంగానే అంత పెద్ద తప్పు చేసిందా.. తెలుసుకోవాలంటే కింద చదవండి..

కత్రినా ఇక దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ఇంకెప్పుడూ తనను ఏ ఫంక్షన్స్‌ కి ఇన్వైట్‌ చేయరని అంటుంది.. దానికి తను చెప్పిన ఒకసిల్లీ రీజన్‌.. అదేంటంటే.. ఇటీవల ‘దీప్‌వీర్‌’బాలీవుడ్‌ ప్రముఖులకు ముంబయిలో ఘనంగా వివాహ విందును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన అతిరథమహారథులు హాజరై కొత్తజంటను దీవించారు. వేడుకకు కత్రినా కూడా వెళ్లింది.

అయితే వేడుకలో భోజనం చేసే సమయంలో కత్రినా అక్కడున్న చాకొలెట్‌ మొత్తాన్ని ఆరగించేశారట. దాంతో భవిష్యత్తులో ‘దీప్‌వీర్’ఎప్పుడైనా పార్టీలునిర్వహిస్తే ఎక్కడ మిగతావారికి మిగల్చకుండా చాకొలెట్‌ తినేస్తానో అని తననిపిలవరేమోనని కత్రినా భయపడుతున్నారు. ఈ విషయాన్ని కత్రినా ‘జీరో’ చిత్ర ప్రచార కార్యక్రమంలో వెల్లడించారు. అంతేకాదు పార్టీ అయ్యేంతవరకు తానుడ్యాన్సులు చేస్తూ బాగా ఎంజాయ్‌ చేశానని తెలిపారు.

leave a reply