నాది, రణ్‌వీర్‌ సలహా ఇదే..

ఇంట్లో వాళ్లు తొందర పెడుతున్నారనో.. స్నేహితులు ఒత్తిడి చేస్తున్నారనో.. పెళ్లి చేసుకోకండి అంటుంది దీపికా పదుకొణే. పెళ్లి అనేది ఓ అద్భుతం.. మనతో జీవితాంతం ఏ వ్యక్తి ఉండాలో.. ఆలోచించుకోవాలి. ఎవరు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో.. వారే మనకు సరిజోడి. ఎందుకంటే..? వాళ్లతోనే జీవితాంతం వరకూ కలిసి ఉండాల్సివస్తుంది. పెళ్లి విషయంలో చాలా కచ్చింగా ఉండాలి. నాది.. రణ్‌వీర్‌ సలహా కూడా ఇదే. ఏ బంధమైనా విజయవంతం కావడానికి నమ్మకం, స్నేహం, పరస్పర గౌరవం చాలా ముఖ్యం’ అని దీపిక చెప్పుకుంటూ వచ్చింది.

దీపికా, రణ్‌వీర్‌ ఆరు సంవత్సరాల ప్రేమ తర్వాత 2018 నవంబర్‌లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. రణ్‌వీర్‌తో వివాహం తర్వాత తన జీవితం చాలా అద్భుతంగా మారిందని ఇటీవల చెప్పిన దీపిక తాజాగా జరిగిన ఫేస్‌బుక్‌ లైవ్‌లోనూ అదే మాటను గుర్తు చేశారు. అంతేకాదు ప్రేమికులకు చక్కటి సందేశం ఇచ్చారు. ప్రేమించుకున్న వారు తమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లాలని చెప్పారు.

leave a reply