ఊళ్లకు వెళ్లేవారు…జర జాగ్రత్త!

సంక్రాంతి సెలవుల కారణంగా సొంతూళ్లకు వెళ్తున్న వారు ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. అయన బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… నగరంలో గతేడాది 6% నేరాలను తగ్గించామని అయన అన్నారు. ముఖ్యంగా నగర  శివార్లలో తాళం వేసి ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు తెగబడుతున్నాయని చెప్పారు. ఊళ్లకు వెళ్లేవారు ముందుగానే స్థానిక ఎస్సైకి సమాచారం ఇవ్వాలని సూచించారు.

నగరంలో 2.5 సీక్రెట్ కెమెరాలు ఉండగా ఏడాది చివరకు 5 లక్ష్యల కెమెరాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో ఆయా కాలనీల్లో పెట్రోలింగ్ పోలీసులు ద్రుష్టి పెడతారని చెప్పారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాలను తగ్గించేందుకు జోనల్‌ కంట్రోల్‌రూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంతో పాటుగా.. ప్రతి పోలీస్‌ ఠాణా పరిధిలో విధుల నిర్వహణపై సమీక్ష చేసుకొనే వీలుంటుందన్నారు.

అంతేకాకుండా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే నేరస్థులు కూడా తప్పించుకోలేరని,  అందుకోసం  అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఏర్పాటుతో నిందితులను అరెస్ట్‌ చేస్తున్నామని కమిషనర్‌ చెప్పారు. అనేక చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడ్డ దొంగలనూ సీసీ కెమెరాల ఆధారంతో  పట్టుకున్నామన్నారు.

leave a reply