నొప్పులను సైతం…లెక్కచేయకుండా

ప్రసవ వేదనలతో కూడా పరీక్ష రాయడానికి వచ్చిన మహిళ. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్తురాజుపాలెంలో జరిగింది. వివరాలలోకి  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా  కావలి మండలం తాగేటివారిపాళెం గ్రామానికి చెందిన థన్యాసి స్వాతికి,  మహేష్‌ అనే కార్పెంటర్‌ వివాహం జరిగింది అయితే వీరు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో.. భర్త మహేష్ మహేష్‌ కష్టపడితే గానీ కుటుంబం గడవని పరిస్థితి. దీంతో తన భార్య స్వాతిని ఆయన చదివించడంలో వెన్నుదన్నుగా నిలిచారు. బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ కళాశాలలో బీఈడీ పూర్తి చేయించి  ఉపాధ్యాయ ఉద్యోగం కోసం శిక్షణ కూడా ఇప్పించారు.

అయితే  ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగం సాధించాలనే కృషితో ఆమె పురిటి నెప్పులను సైతం లెక్కచేయకుండా పరీక్షకు హాజరు అయ్యారు. అంతేకాక పరీక్షకు ముందుగానే నొప్పులు వచ్చే ఆమెకు సూచనలు కనిపించినా ఆ విషయాన్ని తన  భర్తకు కూడా చెప్పకుండా  పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్ష రాస్తుండగా నొప్పులు అధికమైనా పట్టించుకోని ఆమె అలాగే పరీక్షను  పూర్తిచేసి చివరలో స్పృహ కోల్పోయింది.  కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో డీఎస్సీ పరీక్ష గురువారం జరుగుతున్న సమయంలో సంఘటన జరిగింది. పరీక్ష పూర్తైన వెంటనే ఆ పత్రాలను పరిశీలకుడికి ఇచ్చి స్పృహ కోల్పోయింది. కళాశాల ఛైర్మన్‌ పెనుబల్లి బాబునాయుడుకు ఈ విషయం తెలియడంతో తన కారులో ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  అక్కడి వైద్యులు ఆమెకు కాన్పు చేయగా మగబిడ్డ జన్మించాడు.

leave a reply