సిక్కుల ఊచకోత కేసులో.. గడువు నిరాకరణ..

కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సజ్జన్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు కొట్టి వేసింది. సిక్కుల ఊచకోత కేసులో జీవిత ఖైదు పడిన సజ్జన్‌ కుమార్‌కు హైకోర్టు గడువును నిరాకరించింది. లొంగిపోయేందుకు జనవరి 31 వరకు గడువు కావాలని ఆయన చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. డిసెంబర్‌ 31 లోపు లొంగిపోవాలని ఈ నెల 10న తీర్పు వెలువరించిన హైకోర్టు.. గడువు పొడిగించేందుకు ఎలాంటి కారణాలు కన్పించడంలేదని  స్పష్టం చేసింది.

leave a reply