పట్టుబడిన మొదటి ఉద్యోగి అతడే..!

కేంద్ర అధికారిని పట్టుకోని కేసు నమోదు చేసిన ఏసీబీ

ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోదక సంస్థ సరికొత్త సంచలనాన్ని నమోదు చేసింది. లంచం తీసుకుంటున్న కేంద్ర అధికారిని పట్టుకోని కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో సీజీఎస్టీ రేంజ్‌ ఆఫీస్‌ సూపరిండెంట్‌గా పనిచేస్తున్న రమణేశ్వర్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. లోకేష్‌బాబు అనే వ్యక్తిని రమణేశ్వర్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.

అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతోందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి ఏపీలో సీబీఐకి జనరల్‌ కన్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం సీబీఐ పనిని కూడా ఏసీబీకి అప్పగించారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రమణేశ్వర్ తొలిసారి ఏసీబీకి పట్టుబడ్డాడు.

కాగా, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు నిర్లజ్జగా తన రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని ఐటీ సోదాలు జరిగిన నేపథ్యంలో… కక్షపూరిత సోదాలకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని కూడా తేల్చేసిన విషయం తెలిసిందే.

leave a reply