దంతాల పటిష్టం కోసం!

పోషక లోపం, దంతాలను సరిగా శుభ్రపరుచుకోక పోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తుంటాయి. ప్రతిరోజు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి. తీపి పదార్థాలు, చల్లదనం ఎక్కువగా ఉండే పదార్ధాలను తీసుకోకపోవడం మంచిది. అంతేకాక టూత్‌బ్ర్‌షలను రెండు నెలలకొకసారి మార్చాలి. దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల దంతాల మధ్యలో, నోటి లోపల ఇరుక్కుపోయిన ఆహారపదార్థాలు బయటకు పోకుండా అలాగే ఉండి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. పోషకాహార పదార్ధాలు ఎక్కువగా తింటే కావల్సిన పోషకాలు దంతాలకు అందుతాయి.

ఇందుకోసం సూప్స్‌ తాగితే మంచిది. అంతేకాక బాదం, మొక్కజొన్నపొత్తులు, స్ట్రా్ట్రబెర్రీలు ఎక్కువగా తినాలి. చిగుళ్ల నుంచి రక్తం కారుతూ ఇబ్బందిగా ఉన్నపుడు  సి-విటమిన్‌, యాంటాక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. అలాగే పైనాపిల్‌, కీరకాయల్లాంటివి తింటే దంతాలు పటిష్ఠంగా ఉంటాయి.

షుగర్‌ బాగా ఉండే స్పోర్ట్సు డ్రింకులు తాగితే అందులోని యాసిడ్‌ దంతాలను దెబ్బతీస్తుంది. అందుకే వాటికి బదులు కొబ్బరి నీళ్లు, తాజా పళ్లరసం తీసుకోవాలి. అలాగే వేడిగా ఉండే కాఫీ, టీ, సూపులను తాగడం మానాలి. అలా తాగితే దంతాల సున్నితత్వం దెబ్బతింటుంది. దంతాల నొప్పి తగ్గకుండా ఎక్కువగా ఉంటే వెంటనే దంతవైద్యుని సంప్రదించాలి.

leave a reply