కళ్ళ కింద మచ్చలు పోవడానికి!

కళ్ల కింద నల్లటి వలయాలు అందాన్ని తగ్గిస్తాయి. దీనికి కారణం నిద్ర సరిగా లేకపోవడం, టీవీని ఎక్కువ సేపు వీక్షించడం. మొబైల్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల ఈ సమస్య అధికమవుతుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. 

కళ్ళ కింద ఈ నల్లటి వలయాలను తొలగించడానికి పాలు, సెనగపిండి కలిపిన పేస్ట్‌ను వలయాలపై పూసుకుంటే సరిపోతుంది. అందుకోసం రెండు టేబుల్‌ స్పూన్ల సెనగపిండిని తాజా పాలలో వేసి చిక్కని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును నల్లటి వలయాల మీద రాసుకొని, ఆరిపోయాక చల్లటి నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు  చేస్తే కళ్ల కింది నల్లటి వలయాలు తొలగిపోతాయి.

పాలలోని విటమిన్‌ ఎ, విటమిన్‌ బి6 కొత్త చర్మం కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. పాలలోని విటమిన్‌ బి12 చర్మానికి సహజ రక్షణ కవచంగా పనిచేసి, కళ్ల కింది నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది.

leave a reply