వెన్ను నొప్పికి యోగాసనంతో నయం!

ప్రస్తుత జీవన విధానంలో కుర్చీలో ఎక్కువ సేపు కూర్చోవడం, పని భారం ఎక్కువ అవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా వెన్ను నొప్పితో భాధ పడుతుంటారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలకు యోగా చేయడం వల్ల పరిష్కారం దొరుకుతుంది. వెన్నునొప్పి నుంచి బయట పడటానికి యోగా సహాయపడుతుందని, అమెరికా, లండన్‌లలో చేసిన వేరు వేరు అధ్యయనాల్లో తేలింది.

ఈ అధ్యయనంలో సుమారు 1100 మంది స్త్రీ పురుషుల మీద జరపగా…వీరందరూ, వెన్ను నొప్పితో  బాధపడుతున్నవారే కావడం విశేషం. వీరి చేత కొన్ని నెలల పాటు యోగాసనాలు వేయించారు. ఈ విధంగా ఆసనాలు వేసిన వారిలో ఎక్కువ మందికి వెన్నునొప్పి తీవ్రత తగ్గడాన్ని అధ్యయనకారులు వెల్లడించారు. అయితే ఈ సమస్య కేవలం యోగా కారణంగానే తగ్గదనీ, దాని నివారణకు మందులు తీసుకుంటూనే యోగాసనాలు వేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చని వారు తెలియచేసారు.

leave a reply