బ్యాంక్ అకౌంట్‌లోకి 15 లక్షలు..

న్యూఢిల్లీ :బ్లాక్‌మనీపై ప్రధానిమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రాందాస్అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్‌లో  రూ.15 లక్షలుఒకేసారి కాకుండా నెమ్మదిగా చేరుతాయని అన్నారు. విదేశాల్లో దాచుకున్న బ్లాక్‌మనీని భారత్‌కు రప్పిస్తే ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్‌లో రూ.15 లక్షలు వేయొచ్చంటూ నరేంద్రమోదీ 2014  సార్వత్రిక ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నల్లధనాన్ని భారత్‌కు రప్పిస్తామంటూ మోదీ హామీ ఇచ్చారు కూడా.

ఈ హామీలపై విపక్షపార్టీలు ప్రధానిని టార్గెట్ చేయడంపై రాందాస్ అథవాలే సోమవారం స్పందిస్తూ …‘ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం అంత నగదు లేదు. నిధులు సమకూర్చాలని ఆర్‌బీఐని కోరుతున్నా ఇవ్వడం లేదు. అందుకే అంత మొత్తం సమీకరించలేక పోతున్నాం. నగదు ఇస్తామని ఆర్‌బీఐ హామీ ఇచ్చినా అందుకు కొన్నిసాంకేతిక కారణాలు అవరోధంగా మారాయి’ అని అన్నారు.ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అథవాలే మాట్లాడుతూ.. కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే గెలిచిందని, రానున్నసార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. బీజేపీ గెలుపు ఖాయమన్న ఆయన… నరేంద్ర మోదీ తిరిగి ప్రధానమంత్రి అవుతారని ఆయన ధీమావ్యక్తం చేశారు.

leave a reply