మమతా-కేసీఆర్‌ ఫ్రంట్‌..

తెలంగాణ సీఎం కేసీఆర్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ భేటీ ముగిసింది. ఒడిశా పర్యటన పర్యటన ముగించుకొని ఈ సాయంత్రం కోల్‌కతాకు చేరుకున్న కేసీఆర్‌.. మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. అనంతరం కేసీఆర్‌, మమత కలిసి మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాలపై తామిద్దరం చర్చించినట్టు కేసీఆర్‌ వెల్లడించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చలు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయని, ఇప్పటికే తాను ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయి చర్చించానన్నారు. త్వరలోనే ముందుకొస్తామని, మున్ముందు కూడా చర్చలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటు అంటే ఆదర బాదరాగా చేయాల్సింది కాదని కేసీఆర్‌ తెలిపారు.

అలాగే.. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోనూ ఆయన ఢిల్లీలో భేటీ కానున్నారు.

leave a reply