గుటకాయ స్వాహా..

ఒకసారి బీహార్‌లో జరిగిన వార్త విన్నాక.. అందరూ షాక్‌ అయ్యారా.. ఓరినీ.. అనుకున్నారు. అప్పడు ఆ న్యూస్ బాగా వైరల్‌ కూడా అయ్యింది. ఏంటా..? అనుకుంటున్నారా..? ఎలుకలు మద్యం తాగడం.. బెళ్లం తినడం.. వినడానికి వింతగా ఉన్నా అది నిజమే అని స్వయంగా పోలీసులే చెప్తున్నారు.

అయితే.. అలాంటి సంఘటనే మళ్లీ యూపీలోని బరేలీలో చోటుచేసుకుంది. ఎలుకలు మద్యం తాగాయట. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1000 లీటర్లకుపైగా మద్యం సీసాలను అవి ఖాళీ చేశాయట. వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. యూపీలోని బరేలీ పోలీసులు ఇదే చెబుతున్నారు. వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను గోదాములో భద్రపరచగా.. అక్కడ ఉన్న ఎలుకలు వాటిని తాగేశాయట.

కాగా వివరాల్లోకి వెళ్తే.. పలు సందర్భాల్లో సీజ్‌ చేసిన మద్యాన్ని పోలీసులు గోదాంలో నిల్వ చేసి ఉంచారు. ఇటీవల గోదాం తెరిచి చూడగా కొన్ని మద్యం సీసాలు కన్పించకపోవడంతో పాటు.. కొన్ని బాక్సులు రంధ్రాలతో ఖాళీగా కన్పించాయి. దీంతో ఎలుకలు మద్యం తాగాయని ఉన్నతాధికారులకు తెలపగా.. దర్యాప్తుకు ఆదేశించారు. గతంలో బీహార్‌లో మద్యం తాగాయని.. ఝార్ఖాండ్‌లో బెళ్లం తిన్నాయని ఎలుకలపై పోలీసులు ఆరోపణలు చేశారు.

leave a reply