పోలవరంకు `గిన్నీస్‌ రికార్డ్‌’

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరంకు వినూత రికార్డు లభించింది. గిన్నీస్‌ బుక్‌లో పోలవరం చోటు దక్కించుకుంది. 24 గంటల్లో 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ఆదివారం ఉ.8 గంటల నుంచి ఈ రోజు అనగా సోమవారం ఉ.8 గంటల వరకు నిరంతరాయంగా కాంక్రీట్‌ పోసి రికార్డు సృష్టించారు. దీంతో పోలవరం పనుల్లో రికార్డు నమోదైనట్టు గిన్నిస్‌ రికార్డు ప్రతినిధులు ప్రకటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దే సీఎం చంద్రబాబుకు గిన్నిస్‌ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలవరం స్పిల్ వే కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు గిన్నిస్ రికార్డును నెలకొల్పడంపై చాలా సంతోషంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించడం ఓ చారిత్రక ఘట్టమని అన్నారు. కాగా.. ప్రతి తెలుగు వాడు ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రాజెక్టును పూర్తి చేద్దామని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపు నిచ్చారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను చేపట్టిన నవయువ సంస్థను సీఎం చంద్రబాబు అభినందించారు.

leave a reply