విద్యార్ధులపై.. రాక్షసత్వం!

గుంటూరు జిల్లా బాపట్ల అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థిని విద్ధ్యార్ధుల పరిస్థితి దారుణం గామార్చింది యాజమాన్యం. వారితో సమ్మె విరమింప చేయటానికి విద్యార్థుల పట్ల యాజమాన్యంఎంతో రాక్షసత్వం ప్రదర్శిస్తుంది. హాస్టల్ లోని విద్యార్థిని- విద్యార్థులకు  నిన్నటి నుండి తినటానికి తిండి పెట్టకుండామాడ్చేశారు. కనీసం త్రాగటానికి మంచి నీటిని కూడా లేకుండా చేశారు. నేడు ఉదయాన్నేబలవంతంగా పోలీసుల సాయంతో వారిని బయటకు గెంటేశారు. కనీసం ఆడపిల్లలనే విచక్షణ కూడాలేకుండా వారిపట్ల కూడా రాక్షసత్వం గా ప్రవర్తిస్తున్నారు.కనీసం బాత్రూమ్ లకు కూడావెళ్లకుండా వాటిని సైతం తాళాలు వేసి మూసేశారు.

విద్యార్థిని విద్యార్థులు మాత్రం వారి దీక్షవిరమించటం లేదు. ప్రస్తుతం బాపట్ల అగ్రికల్చరల్ కళాశాల ఆవరణ మొత్తం పోలీసులను మోహరించి వారిని బయబ్రాంతులకు గురి చేస్తున్నారు. విద్యార్థిని విధ్యార్దుల పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగి వారికి మద్దతుదారులు పెరుగుతున్నారు.మధ్యాహ్నం  సి.పి.యం రాష్ట్ర మహిళా కార్యదర్శి రమాదేవి హాజరైయ్యి వారికి మద్దతు తెలిపారు.ప్రజా సంఘాల వారు కూడా వారికి మద్దతు తెలుపుతూ నేటి మధ్యాహం విద్యార్థులకు భోజనం ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల పట్ల యాజమాన్య రాక్షస తీరును ఖండిస్తూ UTF అధ్యక్షలు , నాయకులు మద్దతు తెలియచేస్తున్నారు. కళాశాల మొత్తం  పోలీసులను మోహరించి కనీసం విద్యార్థినులు బాత్రూం కు వెళ్ళటానికి  కూడా లేకుండా తాళం వేసిన తీరుని కనీసం బయటకు  కూడా వెళ్లకుండా పోలీసుల పహారాలను ఖండిస్తున్నారు. చలికాలం ఆరుబైట చలిలో వారి దుర్భర పరిస్థితి వర్ణతీతం. కనీసం దేశ బోర్డర్ లో మన చేతికి శత్రువులు దొరికినా అంత క్రూరత్వం ప్రదర్శిస్తారో లేదో కాని యాజమాన్యం మాత్రం వారి పట్ల అంత కృరత్వం ప్రదర్శిస్తుంది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే యాజమాన్యం, పోలీసులే బాధ్యత వహించవలసి ఉంటుందని పలువురు వారి వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

leave a reply