వయసు యాబై దాటిందా!

మహిళల్లో వయసు యాబై దాటాక అనేక సమస్యలు వస్తాయి. ఇవి ఆరోగ్య పరంగానే కాకుండా, మానసికంగానూ సమస్యలు రావడం జరుగుతుంది. పని ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి వాటిని తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

పిల్లలు పెద్దవాళ్లు అవడం, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లడం వలన ఒంటరితనం వచ్చేస్తుంది. ఈ ఒంటరితనం వల్ల ఒత్తిడికి గురవుతారు. ఒంటరితనం గడపడం ఒకే చోట కూర్చుని టీవీ చూడటం వంటివి చేయడం వలన ఒత్తిడి పెరుగుతుంది కానీ తగ్గదు, ఇలాంటప్పుడు స్నేహితులతో కలిసి గడపడం చిన్న చిన్న పార్టీలు చేసుకోవడం వలన ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.

వయసు పెరిగే కొద్దీ శరీరంలో శక్తీ తగ్గిపోతుంది. దీనివల్ల అనేక సమస్యలు రావడం జరుగుతుంది. దీనిని అధికమించడానికి పోషకాహారం తీసుకుంటే సరి! వీటిలో కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలి. వేళకు నిద్రపోవడం, వేళకు తినడం అలవాటు చేసుకుంటే ఒత్తిడిని కూడా అధికమించవచ్చు.

వయసు పెరుగుదలతో శరీరంలో జీవక్రియల రేటు నెమ్మదిస్తుంది. దాంతో అనేక మార్పులు సంభవించి చురుకుదనం కూడా తగ్గుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయాలి. వేగంగా నడవడం వలన శరీరం చురుకుగా పనిచేస్తుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులు కూడా ధరి చేరవు.

leave a reply