వ్యాధులకు పుల్‌స్టాప్‌ జీలకర్ర..

జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. ఒకటి నల్లజీలకర్ర, రోండు మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు. ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు (మసాలా) దినుసులలో ఒకటి. ప్రాచీన కాలము నుండి జీలకర్ర వాడుకలో ఉంది. హిందూ వివాహాల్లో ముఖ్యమైన ఘట్టాల్లో కూడా జీలకర్రను వాడతారు. జీలకర్ర, బెళ్లంను తలపై పెట్టడం ఒక ముఖ్యమైన ఘట్టము.

రోగాలపై జీలకర్ర

కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్రను మంచి ఔషదమని చెప్పొచ్చు. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. గుండె నొప్పులు తగ్గుటకు జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఎలర్జీకి రాకుండా శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. అంతే కాకుండా చాలా రోగాల సమస్యలకు విరుగుడుగా ప్రాచీన కాలంలో జీలకర్రను ఉపయోగించేవారు.

మూత్ర సంబంధ వ్యాధులకు కూడా జీలకర్ర చక్కగా ఉపయోగపడుతుంది. జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి.

ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు, జీలకర్ర మిశ్రమం తీసుకొంటే మంచిది. ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నం, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు.

leave a reply