సైనాకు ఇదే సరైన సమయం!

ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ విజేత అయినా భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ మానసికంగా బలమైన షట్లర్‌ అని మాజీ కోచ్‌ విమల్‌ కుమార్‌ ప్రశంసించాడు. ప్రతిష్ఠాత్మకంగా మొదలవబోయే ఆల్‌ ఇంగ్లాండ్‌ టోర్నమెంట్‌ గెలవడానికి ఈ ఏడాది సైనా నెహ్వాల్‌కు మంచి పరిణామమని అయన అన్నాడు. ఆమె మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా సత్తా ఉన్న షట్లర్‌ అని పేర్కొన్నాడు. ప్రపంచ టాప్‌ స్టార్లు తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)లు ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమయంలో సైనా మార్చిలో ప్రారంభంకానున్న ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయన అన్నారు.

తాజాగా ఇండోనేసియా టైటిల్‌ సాధించడంతో సైనాలో ఆత్మవిశ్వాసం పెగిందన్నారు. సైనా తన అట తీరుతో ప్రత్యర్థిని తికమక పెడుతుందని, ఇదేవిధంగా ఇండోనేసియా టైటిల్‌ గెలిచిందని చెప్పుకొచ్చాడు. మారిన్‌, తై జు యింగ్‌ గాయాలపాలవడంతో వీరు కోలుకునేందుకు కనీసం ఐదారు నెలల సమయం పడుతుంది.. దీంతో సైనా, సింధులకు ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ గెలిచేందుకు ఇది మంచి పరిణామమన్నారు. వీరు ఫిట్‌నెస్‌ఫై ద్రుష్టి పెట్టి విజయం సాధించాలని అయన పేర్కొన్నారు.   

leave a reply