స్మార్ట్ ఫోన్తో… మెదడుకు చేటు!

మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా అయితే మీ మెదడుకు ముప్పు వాటిల్లబోతుంది. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, వీడియో గేమ్‌ సాధనాలు ఎక్కువగా వాడే పిల్లల్లో మెదడు కుంచించుకుపోతున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో  వెల్లడించారు. రోజులో ఏడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం మొబైల్ ఉపయోగించే పిల్లలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు.

ఇందుకోసం 4,500 మంది చిన్నారులపై పరిశోధనలు జరపగా మొబైల్‌ ఎక్కువగా ఉపయోగించే పిల్లల్లో ఈ భాగం క్రమేపీ కుదించుకుపోతుందని అధ్యయనకారులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ వంటి ఇతర వస్తువులపై రెండు గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం గడిపే వారిలో భాష పరంగా రీజనింగ్ సంబంధిత అంశాలపై ప్రభావం ఎక్కువ కనిపిస్తున్నట్లు తెలిపారు. కావున సాధ్యమైనంత వరకు పిల్లలను మొబైల్ లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.  

leave a reply