కోహ్లీకి రెస్ట్.. ప్రపంచకప్ కోసమే..!

న్యూజిలాండ్‌తో జరగనున్న చివరి రెండు వన్డేలకు, టీ20 సిరీస్‌కు టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి రెస్ట్‌ ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గతంలో కోహ్లీకి రెస్ట్ ఇచ్చినప్పుడు కెప్టన్‌గా రోహిత్ శర్మ మంచి ప్రదర్శన కనబరచడంతో ప్రస్తుతం కూడా రోహిత్‌కే బాధ్యతలు అప్పగిస్తున్నారు.

గత కొద్ది నెలల నుంచి విరామం లేకుండా కోహ్లీ ఆడుతుండటంతో ఫిట్‌నెస్‌, ఆరోగ్యం రీత్యా బీసీసీఐ అతడికి విశ్రాంతి ఇచ్చినట్ల్ తెలిపింది. న్యూజిలాండ్‌ పర్యటన తర్వాత ఆసీస్‌తో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లను టీమిండియా ఆడనుండటం, వెంటనే ఐపీఎల్‌ కూడా ప్రారంభం కానుండటంతో.. ఈ ఏడాది మే 30 నుంచి ప్రపంచకప్‌ సమరం మొదలవుతుండగా,  విరామం లేకుండా ఆడటం వల్ల ఆ ప్రభావం ప్రపంచ కప్‌ మీద పడే అవకాశం ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, కివీస్‌తో జరిగే మరో రెండు వన్డేలకు మాత్రమే కోహ్లీ అందుబాటులో ఉండగా, తర్వాత నాలుగు, ఐదో వన్డే మ్యాచ్‌, వచ్చే నెలలో జరిగే మూడు టీ20 మ్యాచ్‌లకు కోహ్లీకి విశ్రాంతి లభించనుంది.

leave a reply