విమానంలో…భయపడ్డ సిబ్బంది!

గోవా వెళ్తున్న విమానంలో క్రిస్మస్ రోజున ఒక సంఘటన చోటు చేసుకుంది. విమానంలో పొగతాగడం నిషేధం అని తెలిసిన లెక్కచేకుండా ఓ ప్రయాణికుడు చేసిన పనికొంతసేపు విమాన సిబ్బందిని కంగారు పెట్టింది. విషయం తెలుసుకున్న సిబ్బంది తర్వాత అతడిని పోలీసులకు అప్పజెప్పింది. విషయానికొస్తే… డిసెంబర్‌ 25 క్రిస్మస్‌ రోజున అహ్మదాబాద్‌ నుంచి గోవా పయనమవుతున్న ఇండిగో విమానం టాయిలెట్‌లో నుంచి బయటకు పొగలు రావడం గమనించిన విమాన సిబ్బంది.. కాసేపు భయబ్రాంతులకు గురయ్యారు. తరువాత ఆ పొగ ఎలా వస్తుందో, దానికి సంబంధించిన కారణం అర్థం కాక కాసేపు భయబ్రాంతులకు గురయ్యారు. కొద్దీ సేపటి తర్వాత ఓ ప్రబుద్ధుడు నెమ్మదిగా టాయిలెట్‌లో నుంచి బయటకు చుసిన సిబ్బంది అది సిగరెట్‌ పొగ అని గుర్తించారు.

అయితే విమానాలలో భద్రతా కారణాల దృష్ట్యా పొగ తాగడం నిషేదం కావున విమానం గోవాలో ల్యాండ్‌ అయిన వెంటనే ఈ విషయాన్నిపోలీసులకు తెలియజేసారు. పొగ తాగిన ప్రబుద్ధుడిపై ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగించారు. అతడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.ఇదివరకు ఒకసారి కూడా ఇలాగే దిల్లీ విమానంలో ఓ ప్రయాణికుడు విమానంలో పొగ తాగేందుకు ప్రయత్నించడంతో మూడు గంటల పాటు విమానం ఆలస్యమైనా సంగతి తెలిసిందే.

leave a reply