తెలుగు సినిమాలో ఎప్పుడూ నెం1 ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. అటువంటి ఆసక్తికర విషయంపై నెం1 స్థానానికి పోటీలో ఉన్న స్టార్ సమాధానం చెబితే ఎలా ఉంటుందో అదే జరిగింది. కాఫీ విత్ కరణ్ అనే షోలో ప్రభాస్ , రాజమౌళి , రానా పాల్గొన్నారు . రకరకాల ప్రశ్నలు అడిగిన తరువాత కరణ్ ప్రభాస్ ను ఓ ఉత్కంట ప్రశ్న అడిగాడు .
“తెలుగు తెర మీద హీరోలకు మీరు ఇచ్చే ర్యాంకులు ఏమిటి ” అని అడిగాడు. తెర మీద అని కరణ్ మరోసారి స్పష్టం చేశాడు కూడా… “జూనియర్ ఎన్టీఆర్, మహేష్ , బన్నీ , రామ్ చరణ్ ” అని ప్రభాస్ వారి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని చెప్పాడు.
వెంటనే తడుముకోకుండా “తారక్ ” అని సమాధానం చెప్పాడు ప్రభాస్ . ప్రభాస్ చెప్పినదాన్ని బట్టి తారక్ నంబర్ వన్ ప్లేసులో ఉన్నాడు . ఆ తరువాతనే మహేష్, మూడవ స్థానంలో బన్నీ, నాలగవ స్థానంలో రామ్ చరణ్ అని సంచలనంగా తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పేశాడు రెబల్ స్టార్.
అయితే.. ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాన్ని కలుగ చేసినా.. మెగా అభిమానులకు మాత్రం కంటగింపుగానే మారింది… అదెలా ఉన్నా ప్రభాస్ ఏ స్థానంలో ఉన్నట్టు ? ఇది ఎవరు చెప్పాలి ? అనే ప్రశ్న మరో మారు తలెత్తింది.