నా దారి నా నిర్ణయమే!

టీం ఇండియాకి పేసర్ల కొరత ఉందంటే అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు భారత బౌలింగ్ త్రయం నడుస్తుంది అటు పేసర్లు ఇటు స్పిన్నర్లు ప్రత్యర్థి జట్టుకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఇక బుమ్రా చక్కని ఫామ్ కనబరుస్తూ… టీమిండియాకు వెన్నుదన్నుగా నిలుస్తూ… ప్రత్యర్థులను తన విభిన్న బౌలింగ్ తో తికమక పెడుతూ… టీమిండియా విజయాలలో కీలకంగా మారాడు. బుమ్రా అంటే పదునైన యార్కర్లు.. అదిరిపోయే వేగమే గుర్తుకొస్తాయి. అయితే ఆ వేగం, యార్కర్లు  టెన్నిస్‌ బంతి క్రికెట్‌ నుంచి నేర్చుకొన్నాడట.

చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ భారత పేసర్‌ విపరీతంగా టెన్నిస్‌ బంతి క్రికెట్‌ ఆడేవాడట. చిన్నతనం నుంచీ నాకు బౌలింగ్‌ చేయడమే ఇష్టం. బ్యాటింగ్ వైపు మొగ్గుచూపే వాడిని కాను, టెన్నిస్‌ బంతి క్రికెట్‌ విపరీతంగా ఆడేవాడిని. అందరూ బ్యాటింగ్‌ వైపు మొగ్గు చూపితే.. నేను మాత్రం బౌలింగ్‌ చేసేవాడినన్నాడు. అప్పుడే నేను ఎంత వేగంగా బంతులు వేయగలనో తెలుసుకున్నాను. టెన్నిస్‌ బంతితో బౌలింగ్‌ చేసేటపుడు బంతి నేలను తాకడం వల్ల వేగం తగ్గిపోతుంది.అందువల్ల  గాలిలోనే వేగంగా బౌలింగ్‌ చేయడం అలవాటు చేసుకున్నా. నా యార్కర్లు కూడా టెన్నిస్‌ బంతి చలవే అని తెలిపాడు.

అయితే అప్పట్లో సరదా కోసం ఆడేవాడిని. కానీ తర్వాత తెలిసింది టెన్నిస్‌ బంతి క్రికెట్‌కు ఎంత ఉపయోగమని. నా బౌలింగ్‌ మీద చాలా మంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసారు. శైలిని మార్చుకోమని చాలామంది సలహాలిచ్చారు. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. నేను నా దారిని  సొంతంగా వెతుక్కోవడానికే ఎక్కువగా ఇష్టపడతాను. ఇతరులపై ఆధారపడటం నాకు ఇష్టముండదు. పరిస్థితులు నాకు అనుకూలించనప్పుడు కూడా ఇదే పద్ధతి పాటిస్తాను. ఈ ధోరణే నాకు చాలా ఉపయోగపడింది’’ అని తెలియజేసాడు.

leave a reply