మెక్‌గ్రాత్.. కోసం

సిడ్నీ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా గెలుపు దిశగా వెళ్తుంది. అయితే మూడో రోజు ఆటలో భాగంగా కోహ్లీసేన గులాబి రంగు టోపీలు ధరించి మైదానంలోకి అడుగు పెట్టింది. మెక్ గ్రాత్ ఫౌండేషన్ కు నిధుల సేకరణ కోసం సిడ్నీ టెస్ట్ మూడోరోజు ఆటను పింక్ డేగా ప్రకటించారు. బ్రెస్ట్‌ కేన్సర్‌ మీద అవగాహన కల్పించడానికి భారత ఆటగాళ్లు గులాబి రంగు టోపీలు ధరించారు. అయితే వీటిని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌కు నిధుల సేకరణకు గౌరవ సూచకంగా వీటిని ధరించారు.

టీం ఇండియా ఆటగాళ్లకు పింక్ టోపీలను ఇచ్చి ఆసీస్ క్రికెట్ మైదానంలోకి ఆహ్వానించింది. దీంతో స్టేడియం మొత్తం గులాబీ రంగుతో నిండిపోగా.. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంచి స్పందన వచ్చింది. చాలామంది  క్రికెట్‌ అభిమానులు కూడా  గులాబీ రంగు దుస్తులు ధరించి మైదానానికి వచ్చారు. ఈ రోజు సేకరించిన మొత్తాన్ని ఆస్ట్రేలియా వ్యాప్తంగా బ్రెస్ట్‌ కేన్సర్‌తో బాధపడుతున్న వారికి మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌ ద్వారా అందిస్తారు. మెక్‌గ్రాత్‌ భార్య జేన్‌ మెక్‌గ్రాత్‌ బ్రెస్ట్  కేన్సర్‌తో  2008లో మృతి చెందారు. దీంతో  ఈ మహమ్మారి నుంచి మిగిలిన వారు పడకుండా, మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు.  బ్రెస్ట్‌ కేన్సర్‌ బాధితులకు ఈ ఫౌండేషన్  అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, చికిత్సలో సాయం అందించడం వంటి సహాయక చర్యలు చేపడుతుంది.

leave a reply