ధోని దగ్గర ఎన్నో.. ఆసక్తికర విషయాలు నేర్చుకున్న.


అడిలైడ్‌ లాంటిమ్యాచుల్లో ఒక వికెట్‌ కీపర్‌ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓపిగ్గా ఎలా ఉండాలోనేర్పించాడు.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో గెలిచినా ఫస్ట్ టెస్టులో రిషబ్ పంత్ ప్రపంచ రికార్డును సమం చేసాడు. పంత్ ఏకంగా 11 క్యాచ్‌లు అందుకున్నాడు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ దేశంలో పెద్ద హీరో అని యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ పేర్కొన్నాడు. ఆటలో ఎన్నో మెళకువలు నేర్పించడమేకాక ఒత్తిడిని ఎలా జయించాలో, సమయస్ఫూర్తిగా ఎలా ఉండాలో నేర్పించాడని పేర్కొన్నాడు.ఇంగ్లింగ్‌ ఆటగాడు జాక్‌ రసెల్‌,సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ రికార్డులను రిషబ్ పంత్ సమం చేసాడు. టెస్టు టీంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో సాధించడం గమనార్హం. 

ఈ సందర్భంగా ధోనీ గురించి మాట్లాడుతూ..’ధోనీ నేతృత్వంలో జట్టు ఎన్నోవిజయాలను చవిచూసింది. దేశంలో ధోని పెద్ద హీరో. ఒక వ్యక్తిగా, క్రికెటర్‌గా తనను చూసి ఎంతో నేర్చుకున్నా. మహీ భాయ్ నా పక్కన ఉన్నప్పుడు నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటా. అయన  దగ్గర ఎన్నో ఆసక్తికర విషయాలు నేర్చుకున్న.  ఏదైనా సమస్య వచ్చినపుడు  పరిష్కారం తెలుసుకుంటా. అడిలైడ్‌ లాంటి మ్యాచుల్లో ఒక వికెట్‌ కీపర్‌ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓపిగ్గా ఎలా ఉండాలో నేర్పించాడు. రెకార్డుల గురించి నేను ఆలోచించలేదు. మంచి క్యాచ్‌లు అందుకోవడంలో ముందుంటాను. వ్యక్తిగత పేరు  రావడం గొప్పే కానీ వాటి గురించి ఎక్కువగా ఆలోచించనని పంత్‌ చెప్పుకొచ్చాడు.

leave a reply