ఆ’మంచి’… విభేదాలు.

చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టి‌డి‌పి పార్టీ పెద్దలతో విభేదాలు ఉన్నాయని పార్టీని వీడిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గాన్ని టి‌డి‌పి నేతలు నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరూ కలిసి రాని చోటుగా భావిస్తున్నారని. తన నియోజకవర్గం పై పెద్ద ఆసక్తి చూపట్లేదాని ఆయన 10 లక్షలు కార్చుపెట్టి ఏర్పాటు చేసిన సభ కి కూడా లోకేష్ హాజరుకాలేదని ఆమంచి ఇది వరకే వ్యక్యానించారు. ఈ క్రమంలో వై‌సి‌పి అధినేత వై‌ఎస్ జగన్ సమక్షం లో వై‌సి‌పి లో చేరడం తెలిసిందే. అదేంటో మరి ఆయన వై‌సి‌పి లో చేరినా.. అక్కడ కూడా ఇలాంటి విభేదాలే ఎదురవుతున్నాయి..!

ఆమంచి పార్టీలో చేరి కొద్ది రోజులు కూడా గడవలేదు. అప్పుడే..పార్టీలో బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. గత ఎన్నికలలో చీరాల నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి సమన్వయకర్తగా పని చేస్తున్న యడం బాలాజీ పార్టీ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. ఆమంచి పార్టీలో చేరడాన్ని తాను స్వాగతించనని బాలాజీ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆమంచిని పార్టీలో చేర్చుకునే విషయాన్ని ముందుగా తెలిజేయకపోవడంపై బాలాజీ ఆనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు శనివారం హైదరాబాదులో జగన్‌ను కలిసిన బాలాజీ ఆయన ఎదుట తన అసంతృప్తిని తెలియజేసినట్లు తెలుస్తోంది. జగన్ తో చర్చల ఫలితం ఎలా ఉన్నా.. బాలాజీ మాత్రం పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారని మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయం పై అధికారికంగా ప్రకటన చేయనున్నారని సమాచారం.

leave a reply