అజీర్తి సమస్య ఎక్కువగా ఉందా!

ప్రస్తుతం ఉన్న జీవన సమస్యలలో ఎక్కువగా వేధించేది అజీర్తి. ఇది సమయానికి సరిగా ఆహారం తీసుకుపోవడం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల తేన్పులు, పొట్ట ఉబ్బరంగా ఉండటం ఎంతకీ తగ్గకపోవడం జరుగుతుంది. ఈ సమస్యను అధికమించడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.  ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.  పొట్ట నిండిన ఫీలింగ్‌ రావడానికి, జీర్ణక్రియ బాగా జరగడానికి పీచుపదార్థాలు బాగా ఉపయోగపడతాయు. తాజా పండ్లు, నట్స్‌, ఆకుకూరలు ఎక్కువగా తినండి. మసాలాలు, వేయించిన పదార్థాలు, వెన్నతో చేసిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.

భోజనం సమయాన్ని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని తీసుకోవడం మానకూడదు. సమయానికి భోజనం చేయకపోతే శరీరం కొవ్వును నిలువ చేసుకుంటుంది. అంతేకాకుండా సమయం తప్పిన తరువాత తిన్నట్లయితే ఎక్కువ ఆహారం తినే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి భోజనం చేయడం మంచిది.

చాలామంది నీళ్లు సరిగా తీసుకోరు దీనివల్ల డిహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది.  ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. భోజనం పూర్తి కాగానే ఫుల్‌గా నీళ్లు తాగేస్తుంటారు. అలాకాకుండా భోజనం పూర్తయిన అరగంట తరువాత నీళ్లు తాగాలి. దీనివల్ల జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. మలబద్ధకం లేకుండా చూసుకోండి. మలవిసర్జన సాఫీగా జరగకపోతే అనేక సమస్యలు మొదలవుతాయి.

leave a reply