ఒక తల్లి, కవల పిల్లలు, వేర్వేరు తండ్రులు!

ఒక తల్లి, కవల పిల్లలు, వేర్వేరు తండ్రులు.. ఇదేదో తికమకగా ఉందనుకుంటున్నారా..? మళ్ళీ ఒకసారి చదవండి..! ఒక తల్లి ఇద్దరు కవలలకి జన్మనిచ్చింది, ఆ కవలలిద్దరూ వేర్వేరు తండ్రులకి జన్మించిన శిశువులు..! ఇది లాస్ వెగాస్‌లో జరిగిన ఒక వింత కథ.. అవును శాస్త్ర ప్రకారం ఇది సంభవం ఈ పరిణామాన్ని ఆంగ్లం లో ‘ తృపల్ ’ అని అంటారు. ఒక్క గర్భం ఇద్దరి వీర్యం వల్ల ఈ ప్రక్రియ ని ప్రారంభిస్తారు. సరోగసి ద్వారా శిశువు కి జన్మనిచ్చే మహిలలకి ఈ ప్రక్రియ చేస్తారు.

సైమన్స్, గ్రేయమ్ ఇద్దరూ ఇంగ్లండ్ పౌరులు. తండ్రులు కావాలనుకున్నపుడు వీరికి ఓ సవాలు ఎదురయ్యింది. ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లలను పొందేందుకు (సరొగేట్ మదర్)ను వెతకాల్సి వచ్చింది. వీరికి ఇప్పుడు ఇద్దరు (సరొగేట్ మదర్స్) కావాల్సివచ్చింది. కానీ ఐవీఎఫ్ కోసం వీరు ఆశ్రయించిన ఏజెన్సీ.. రెండు పిండాలనూ ఒకే మహిళ గర్భంలో ఒకేసారి ప్రవేశపెట్టొచ్చని చెప్పింది. కానీ ఈ విషయంలో సహాయం కోసం ఇద్దరూ విదేశాలకు వెళ్లారు.

సదరు మహిళ గర్భంలో అండాన్ని రెండుగా విడదీసి, అందులో ఒక భాగాన్ని సైమన్స్ వీర్యంతో, రెండో భాగాన్ని గ్రేయమ్ వీర్యంతో ఫలదీకరణ చేశారు. తర్వాత ఈ రెండు పిండాలను ఆ మహిళ గర్భంలో ప్రవేశపెట్టారు దీంతో ఆ తల్లి ఇద్దరు కవలలకి జన్మనిచ్చింది. ఆ ముగ్గురు ప్రముఖ చానల్ కి ఇంటెర్వ్యూ ఇచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

leave a reply