శ్రీరంగం ‘రంగనాథాలయం’

శ్రీ మహావిష్ణువు శేషతల్ప సాయిగా వుండే మూల విరాట్టుతో రంగానాథావతారంగా శ్రీరంగంలోని శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో పూజలందుకుంటాడు. ద్రావిడ నిర్మాణ శైలిలో వుండే ఈ గుడి నిర్మాణం గురించి ఎన్నో సార్లు ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో ప్రస్తావించారు. విష్ణువు ప్రధాన దైవంగా నిర్మించిన 108 దివ్య దేశాల్లో ఈ దేవాలయం మొదటిది. దక్షిణ భారతం లోని సుప్రసిద్ధ వైష్ణవాలయాలలో ఈ గుడి చాల ప్రముఖమైనది. వైభవంగా నిర్మించిన ఈ దేవాలయం ఒక సున్నితమైన ప్రదేశంలో నిర్మించ బడడం వల్ల ఇది బలానికి, శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రాకృతిక ఉపద్రవాల అంచున వున్న ఈ దేవాలయం గతంలో చాలా సార్లు డచ్చి, పోర్చుగీస్, ఇంగ్లీష్ వారి దాడులను తట్టుకుని కాల పరీక్షకు నిలబడింది.

రంగనాథస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు.

ఈ ఆలయం మొక్క ప్రత్యేకతలు: ‘పవిత్రోత్సవం’ నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని ఆగస్టు-సెప్టెంబరులో పూజాధికారాల్లో దోషాలను తొలగించేందుకు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తారు.

leave a reply